: అవినీతి కేసులో పాక్ ఆపద్ధర్మ ప్రధాని షాహిద్ ఖాకన్ అబ్బాసీ!
అధికార పార్టీ పీఎంఎల్-ఎన్ తరఫున పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్నికైన షాహిద్ ఖాకన్ అబ్బాసీ మీద అవినీతి కేసు విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు పెట్రోలియం, సహజవనరుల మంత్రిగా పనిచేసిన ఆయన మీద 2015లో గ్యాస్ కాంట్రాక్ట్ విషయంలో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అవినీతి కేసు నమోదు చేసింది. ఇంకా విచారణ కొనసాగుతున్న ఈ కేసులో షాహిద్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆపద్ధర్మ ప్రధానిగా షాహిద్ ఎన్నికను సవాలు చేస్తూ పాకిస్థాన్ సుప్రీం కోర్టు లాహోర్ రిజిస్ట్రీలో ఓ పిటిషన్ దాఖలైంది. అవినీతి కేసులో విచారణ ఎదుర్కుంటున్న షాహిద్‌ను ఆపద్ధర్మ ప్రధానిగా ఎలా ఎన్నుకుంటున్నారని ఈ పిటిషన్ ప్రశ్నిస్తోంది.