: మేనేజర్ల విషయంలో తప్పుటడుగులు వద్దు... తోటి హీరోయిన్లకు సలహాలు ఇస్తున్న హెబ్బా పటేల్
టాలీవుడ్ డ్రగ్స్ దందాపై హీరోయిన్ హెబ్బా పటేల్ స్పందిస్తూ, తోటి హీరోయిన్లకు సలహాలు, సూచనలు ఇస్తోంది. డ్రగ్స్ వాడకం ప్రమాదకరమని చెబుతూనే, మేనేజర్లను ఎంపిక చేసుకునే ముందు కొత్త హీరోయిన్లు, మేనేజర్లను మార్చే ముందు పాత హీరోయిన్లు వారి గురించిన అన్ని విషయాలూ తెలుసుకోవాలని అంటోంది. డ్రగ్స్ దందాలో కొందరు హీరోయిన్ల మేనేజర్లపై ఆరోపణలు రావడం, హీరోయిన్ కాజల్ డేట్లు చూసే మేనేజర్ అరెస్టు కావడాన్ని ప్రస్తావిస్తూ, మేనేజర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. వీలైనంత వరకూ సొంత వారితోనే సేవలందుకోవాలని చెబుతోంది. తప్పుటడుగులు వేస్తే, చాలా నష్టపోవాల్సి వస్తుందని హెబ్బా పటేల్ అభిప్రాయపడింది.