: హుటాహుటిన వెళ్లి శిల్పా చక్రపాణితో భేటీ అయిన బొత్స, రవీంద్రనాథ్ రెడ్డి
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీని ఎలాగైనా తమ పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్న వైకాపా... బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిలను రంగంలోకి దించింది. కాల్వ శ్రీనివాసులుతో పాటు, ఎంపీ సీఎం రమేష్ వెళ్లి చక్రపాణితో మాట్లాడారని, ఆయన కొంత మెత్తబడ్డట్టు కనిపించి, శ్రీశైలం టికెట్ గ్యారెంటీగా ఇస్తామని హామీ ఇస్తే, తెలుగుదేశంతోనే ఉంటానని ఆయన చెప్పినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో విషయాన్ని చంద్రబాబుకు చేరవేసి, ఆయన అభిప్రాయాన్ని చెబుతామని, రమేష్, కాల్వ వెల్లడించగా, ఈ విషయాన్ని తెలుసుకున్న వైకాపా నేతలు, హుటాహుటిన శిల్పా చక్రపాణితో భేటీ అయ్యేందుకు వచ్చారు. వైకాపాలో ఆయనకు లభించనున్న ప్రాధాన్యాన్ని, సొంత సోదరుడిని గెలిపించుకోవాల్సిన అవసరాన్ని వారు చెబుతున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ మధ్యాహ్నం శిల్పా చక్రపాణి, తన వర్గం అనుచరులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.