: 'మండలి' నాయకత్వం యనమలకే
శాసనమండలిలో టీడీపీ సభ్యులకు నాయకత్వం వహించే బాధ్యతను అధినేత చంద్రబాబు.. యనమల రామకృష్ణుడికి కట్టబెట్టారు. ఈ సాయంత్రం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన బాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు శాసనమండలిలో టీడీపీకి నేతృత్వం వహించిన సీనియర్ నేత దాడి వీరభద్రరావు పార్టీని వీడిన సంగతి తెలిసిందే.