: సినీ ప్రముఖులను 88 గంటల పాటు విచారించిన సిట్... కీలక విషయాల సేకరణ


డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపే ప్రయత్నంలో 12 మంది సినీ ప్రముఖులను ఇప్పటి వరకు సిట్ విచారించిన సంగతి తెలిసిందే. నేడు యువ నటుడు నందును విచారిస్తున్నారు. తనకు దురలవాట్లు లేవని స్పష్టం చేసిన నేపథ్యంలో, నందును సాక్షిగా విచారించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్ కు చెందిన 11 మంది సినీ ప్రముఖులను 88 గంటల పాటు సిట్ విచారించింది. ఈ విచారణలో డ్రగ్స్ కు సంబంధించిన కీలక విషయాలను తెలుసుకున్నట్టు తెలుస్తోంది.

కాల్ లిస్ట్, వీడియో, ఆడియో పుటేజీల సాయంతో విచారణ నిర్వహించినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ వినియోగం, రవాణా, అలవాట్లు వంటి విషయాలపై కీలక ఆధారాలను సేకరించినట్టు పేరు చెప్పని అధికారులు తెలిపారు. డ్రగ్స్ మూలాలు విదేశాల్లో ఉన్నాయని, భారత్ లో గోవా నుంచి వాటి సరఫరా అధికంగా ఉందని తెలుస్తోంది. అయితే సినీ ప్రముఖులు ఇచ్చిన సమాచారంతో మరింత మందితో జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో, సిట్ అధికారులు విచారణను ఇక్కడితో ముగిస్తారా? ఇంకా కొనసాగిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News