: ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్న నందు... సిట్ విచారణకు హాజరు


యువ నటుడు నందు అలియాస్ ఆనందకృష్ణ సిట్ కార్యాలయానికి చేరుకున్నాడు. డ్రగ్స్ కేసులో సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో నేడు విచారణకు హాజరయ్యాడు. పది గంటలకు సిట్ కార్యాలయానికి చేరుకున్న నందు... సిట్ కార్యాలయం ముందున్న గుడిలో పూజలు నిర్వహించాడు. అనంతరం సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యాడు. కాగా, తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, సినీ పరిశ్రమలో నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నానని, తనపై తప్పుడు ప్రచారం వద్దని గతంలో నందు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో నందు విచారణ ఆసక్తి రేపుతోంది. 'ఫొటో' సినిమాతో సినీ రంగప్రవేశం చేసిన నందు, 100% లవ్ వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. అనంతరం నేపథ్య గాయని గీతా మాధురిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News