: అమెరికన్ ను కాపాడబోయి గల్లంతైన హైదరాబాదీ!
అమెరికాలో హైదరాబాదీ గల్లంతయ్యాడు. హైదరాబాదుకు చెందిన అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి అమెరికాకు ఉపాధి నిమిత్తం వెళ్లారు. అక్కడ ప్రమాదంలో ఉన్న అమెరికన్ ను కాపాడేందుకు అబ్దుల్ ఖాదర్ నీటి ప్రవాహంలో దిగాడు. నీటి ప్రవాహవేగానికి అబ్దుల్ ఖాదర్ కొట్టుకుపోయి గల్లంతయ్యారు. అతని కోసం స్థానిక పోలీసులు గాలింపు చేపట్టారు. విషయం తెలియడంతో ఖాదర్ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.