: వైట్‌హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్‌పై ట్రంప్ వేటు... నియమించిన పది రోజులకే తొలగించిన అధ్యక్షుడు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పది రోజుల క్రితం నియమితులైన ఆంథోనీ సారముక్కిని ఆ పదవి నుంచి తొలగించినట్టు సమాచారం. ఆంథోనీని స్వయంగా ట్రంపే ఆ పదవిలో నియమించగా, ఇప్పుడు ఆయనే ఆంథోనీని ఇంటికి పంపారని పేర్కొంది. ఆంథోనీ తీరు వివాదాస్పదంగా మారడం ఇందుకు కారణమని తెలిపింది. సహచరులపై చీటికిమాటికి చీదరించుకుంటుండడంతోపాటు చీఫ్ ఆఫ్ స్టాఫ్ రియెన్స్ ప్రీబస్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన ఉద్యోగం వదిలి వెళ్లిపోయేందుకు ఆంథోనీ కారణమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. కొత్తగా నియమితుడైన చీఫ్ ఆఫ్ స్టాప్ జాన్ కెల్లీ అభ్యర్థన మేరకే ఆంథోనీని తొలగించినట్టు ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది.