: 2028 ఒలింపిక్స్‌కు లాస్ ఏంజెలెస్ ఆతిథ్యం.. లాస్ ఏంజెలెస్ టైమ్స్ వెల్లడి!
2028 సమ్మర్ ఒలింపిక్స్‌కు లాస్ ఏంజెలెస్ ఆతిథ్యం ఇవ్వనున్నట్టు ‘లాస్ ఏంజెలెస్ టైమ్స్’ పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది. ఒలింపిక్ నిర్వహణ కమిటీతో ఇప్పటికే డీల్ కుదిరిందని పేర్కొంది. 2024 ఒలింపిక్స్ పారిస్‌లో జరగనుండగా ఆ తర్వాత జరిగే ప్రపంచ క్రీడా వేదికకు లాస్ ఏంజెలెస్ ఆతిథ్యం ఇవ్వనుందని వివరించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుంచి అతి త్వరలో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ విషయాన్ని రాయిటర్స్ వంటి ప్రతిష్ఠాత్మక వార్తా సంస్థలు ధ్రువీకరించలేదు. మరోవైపు సెప్టెంబరులో పెరులోని లిమాలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) సమావేశం తర్వాత కానీ ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.