: పాతబస్తీలో దారుణం... ఇద్దరు విద్యార్థినులు ప్రయాణిస్తున్న ఆటో హైజాక్!


హైదరాబాదులోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థినులు ప్రయాణిస్తున్న ఆటోను దుండగులు హైజాక్ చేశారు. అనంతరం అందులోని యువతులిద్దర్నీ వివాహం చేసుకుంటామని అంగీకరించాలని బెదిరించారు. యువతులు అంగీకరించకపోవడంతో వారిద్దరినీ చితకబాది వదిలారు. దీనిని వీడియో తీసిన ఓ విద్యార్థిని, ఆ సాక్ష్యంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించడంతో విషయం తెలుసుకున్న దుండగులు పరారయ్యారు. 

  • Loading...

More Telugu News