: మద్యం, సిగరెట్లు తాగుతుంటా.. నన్ను ఇరికించి నా కెరీర్‌ను నాశనం చేయద్దు: హీరో తనీశ్ వేడుకోలు


తనకు  మద్యం,  సిగరెట్ తాగే అలవాటు ఉందని, అయితే తనెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని టాలీవుడ్ నటుడు తనీశ్ చెప్పాడు. డ్రగ్స్ కేసులో సోమవారం సిట్ విచారణకు హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడాడు. డ్రగ్స్ కేసులో తన పేరు వెలుగులోకి రావడంతో తాను చాలా బాధపడ్డానని, కుటుంబ సభ్యులు కూడా ఆవేదనలో మునిగిపోయారని తెలిపాడు. తాను ఇప్పుడిప్పుడే సినీ రంగంలో ఎదుగుతున్నానని, తనను ఇరికించి తన కెరీర్‌ను దెబ్బతీయ వద్దని కోరాడు.

నాలుగు గంటలపాటు సాగిన విచారణలో సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్టు తెలిపాడు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తాయో, ఎవరు తెస్తారో తనకు తెలియదని, తానెవరికీ ఇవ్వలేదని, ఎవరి నుంచీ తీసుకోలేదని స్పష్టం చేశాడు. అంతేకాదు, డ్రగ్స్‌ను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నాడు. ‘సే నో టు డ్రగ్స్’కు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాల్సి ఉందన్నాడు. వార్త ఇచ్చే ముందు బాధితుడి వివరణను కూడా మీడియా తీసుకుంటే బాగుంటుందని హితవు  పలికాడు.

  • Loading...

More Telugu News