: మోదీపై నితీశ్ ప్రశంసల జల్లు.. ఆయనను ఢీకొట్టే మొనగాడే లేడన్న బీహార్ సీఎం!


ప్రధాని నరేంద్రమోదీపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన శక్తికి తిరుగులేదని, వచ్చే ఎన్నికల్లో ఆయనను ఢీకొట్టే మొనగాడే లేడని కితాబిచ్చారు. మోదీని ఎదుర్కోగలిగే పార్టీ కానీ, నేత కానీ లేరన్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి సోమవారం పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా, మరోపక్క ఆర్జేడీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్‌ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌పై బీహార్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మంత్రులుగా లాలు కుమారులు తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. ఇదిలా ఉంచితే, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉందని, కాబట్టి ఆయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.  మరోవైపు ఢిల్లీలో శరద్ యాదవ్ మాట్లాడుతూ మహాకూటమి విచ్ఛిన్నం కావడం దురదృష్టకరమన్నారు.

  • Loading...

More Telugu News