: విక్రమ్ గౌడ్ కేసులో కొత్త ట్విస్టు... కథ, స్క్రీన్ ప్లే సమకూర్చింది విక్రమ్ గౌడ్!


మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కాల్పుల కేసులో కొత్త ట్విస్టు వెలుగు చూసింది. ఈ ఘటనలో విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిపింది అతని స్నేహితులేనని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ కాల్పులకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా విక్రమ్ గౌడేనని వారు చెబుతున్నారు. విక్రమ్ గౌడ్ తనపై కాల్పులు జరపమని స్నేహితులకు చెప్పి, తర్వాత వారిని తప్పించుకుని పోవాలని చెప్పినట్టు తెలుస్తోంది.

కాల్పులు జరిగిన అనంతరం షిపాలికి ఏం జరిగిందో చెప్పి, పోలీసులకు కూడా అలాగే చెప్పాలని కోరినట్టు తెలుస్తోంది. దీంతోనే విక్రమ్ గౌడ్ చెప్పినట్టు షిపాలి చెప్పిందని వారు చెబుతున్నారు. అంతే కాకుండా విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిపిన గన్ కూడా వారిదగ్గరే లభ్యమైనట్టు వారు చెబుతున్నారు. విక్రమ్ గౌడ్ స్నేహితులను విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దీంతో ఈ కేసును ఛేదించినట్టు వారు పేర్కొంటున్నారు. 

  • Loading...

More Telugu News