: ఎన్ఐఏ చేతికి ఉగ్రవాదుల క్యాలెండర్... అడ్డంగా బుక్కైన గిలానీ


జమ్మూ కశ్మీర్ వేర్పాటువాది, హురియత్ కాన్ఫరెన్స్ నేత సయీద్ అలీషా గిలానీకి సంబంధించిన విస్మయం గొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. వేర్పాటు వాదులు ఉగ్రవాదులకు నిధులను సమకూర్చుతున్నారని నిర్ధారించే సాక్ష్యాలను ఎన్ఐఏ అధికారులు సేకరిస్తున్నారు. ఇందులో ఉగ్రవాదులు ఎప్పుడు? ఎక్కడ? ఎలా? అల్లర్లు చేయాలి? అన్న విషయాలను వివరించే క్యాలెండర్ ను ఎన్ఐఏ అధికారులు సేకరించారు. ఈ క్యాలెండర్ పై కశ్మీర్ లో కరుడుగట్టిన వేర్పాటు వాది, హురియత్ నేత గిలానీ స్వయంగా సంతకం చేసినట్టు అందులో ఉండడం విశేషం.

గిలానీ అల్లుడు అల్తాఫ్ అహ్మద్ షా 'ఫాంతూష్' వద్ద దీనిని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. 8 జూలై 2016లో ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ అనంతరం ఆగస్టులో అల్లర్లు ఎక్కడ? ఎప్పుడు? ఎలా? చేయాలన్న వివరాలు స్పష్టంగా ఉండడం విశేషం. అందులో ఉన్నట్టే అల్లరి మూకలు భద్రతా బలగాలపై రాళ్ల దాడులు జరిపినట్టు చెబుతున్నారు. సుమారు ఆరునెలలు అల్లరిమూకలను నిలువరించేందుకు సైన్యం సంయమనం పాటిస్తూనే, తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. 

  • Loading...

More Telugu News