: మహేశ్ బాబు సినిమా అనగానే మరేమీ ఆలోచించకుండా ఒప్పేసుకున్నా: 'ప్రేమిస్తే' ఫేం భరత్


సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో ఆఫర్ అనగానే మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకున్నానని 'ప్రేమిస్తే' ఫేం భరత్ తెలిపాడు. మహేశ్ బాబు స్పైడర్ సినిమాలో ప్రధాన విలన్ గా 'ఖుషీ' సినిమా దర్శకుడు ఎస్.జే.సూర్య నటిస్తున్న సంగతి తెలిసిందే. సెకెండ్ విలన్ గా భరత్ నటిస్తున్నాడు. అయితే తమిళనాట హీరోగా నటిస్తూ, మరోపకాక్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించడం కెరీర్ కు ఇబ్బంది కదా...? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన అవకాశం రావడంతో పాత్ర ఏంటన్నది చూళ్లేదని చెప్పాడు.

ద్విభాషా చిత్రం కావడంతో రెండు భాషల్లోనూ డబ్బింగ్ చెప్పాల్సి వచ్చిందని అన్నాడు. మహేశ్ బాబు రెండు భాషలు బ్రహ్మాండంగా మాట్లాడగలరు కానీ, తనకు తెలుగు రాదని చెప్పాడు. డైలాగులు భారీగా ఉండేవని, కానీ మహేశ్ బాబు, మురుగదాస్ ఓపిగ్గా డైలాగులు చెప్పించారని అన్నాడు. రోలర్ కోస్టర్ పై మహేశ్ బాబుతో ఒక సన్నివేశం ఉందని, దానిని 15 రోజుల పాటు చిత్రీకరించారని అన్నాడు. 'స్పైడర్‌' సినిమా తన కెరీర్‌ లో చిరకాలం గుర్తుండిపోయే సినిమాగా నిలుస్తుందని అన్నాడు. దీని తరువాత విలన్ అవకాశాలు వచ్చినా నటించనని అన్నాడు. హీరోగా నటించడమే తన లక్ష్యమని భరత్ చెప్పాడు. 

  • Loading...

More Telugu News