: అభిమానులకు సర్ ప్రైజ్ నిచ్చిన అల్లు అర్జున్!
టాలీవుడ్ ప్రముఖ యువనటుడు అల్లు అర్జున్ అభిమానులకు సర్ ప్రైజ్ నిచ్చాడు. సాధారణంగా సినిమాలు, వాటికి సంబంధించిన విశేషాలను మాత్రమే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకునే అల్లు అర్జున్ అప్పుడప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలతో సర్ ప్రైజ్ చేస్తుంటాడు.
తాజాగా తన కుమార్తె అర్హ ఫోటోతో అభిమానులను ఆనందానికి గురి చేశాడు. తన కుమార్తెతో ఆనందంగా గడిపిన సందర్భంగా తీసిన ఫోటో సోషల్ మీడియాలో పోస్టు చేసిన బన్నీ... 'కుమార్తెకు ఆమె తండ్రి మొదటి ప్రేమికుడు. చిరకాల హీరో' అంటూ వ్యాఖ్యను కూడా జత చేశాడు. ఈ వ్యాఖ్య అల్లు అర్జున్ అభిమానులను ఆకట్టుకుంటోంది. దీనికి లక్షల్లో లైకులు రాగా, 'ఎంత అందంగా ఉందో' అంటూ సమంత కితాబునిచ్చింది.