: `యుద్ధం శరణం` టీజర్ విడుదల!
అక్కినేని నాగచైతన్య నటించిన `యుద్ధం శరణం` సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌ను నాగచైతన్య తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. నిమిషం పాటు ఉన్న ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఇందులో నాగచైతన్య సరసన లావణ్య త్రిపాఠి నటిస్తోంది. నూతన దర్శకుడు కృష్ణ మరిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయక పాత్ర పోషించాడు. అలాగే రేవతి, రావు రమేశ్‌లు కీలక పాత్రలు పోషించారు. డ్రోన్లు తయారు చేసుకుంటూ జీవించే ఓ యువకుడి కథ నేఫథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాను తన మేనమామ వెంకటేష్ సిఫారసు మేరకు చైతన్య అంగీకరించినట్లు సమాచారం.