: అమెరికా మెప్పు కోసం ఉత్తరకొరియాను హెచ్చరించిన పాకిస్థాన్!


ఉగ్రవాదాన్ని నిరోధించడంలో విఫలమైన పాకిస్థాన్ కు నిధుల మంజూరును అమెరికా నిలిపివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు అమెరికా భారత్ ను నమ్మదగిన దేశంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికాతో వివాదం మంచిది కాదని భావించిన పాకిస్థాన్... ఆ దేశాన్ని మచ్చిక చేసుకునేందుకు సరికొత్త మార్గం ఎంచుకుంది. అమెరికాతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియాను హెచ్చరించింది. ఐక్యరాజ్యసమతి తీర్మానాలకు విరుద్ధంగా ఉత్తరకొరియా నడుచుకుంటోందని మండిపడింది.

తద్వారా ప్రపంచ శాంతి, సుస్థిరతలకు విఘాతం కలిగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాను అనవసరంగా రెచ్చగొట్టవద్దని, అమెరికా సహనం కోల్పోతే వచ్చేది యుద్ధమేనని పాకిస్తాన్ హోంశాఖ కార్యాలయం హెచ్చరించింది. న్యూక్లియర్ క్షిపణి పరీక్షలను కూడా నిరోధించాలని సూచించింది. కొరియన్ ద్వీపకల్పంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తం కానున్నాయని, అందుకే ఉత్తరకొరియా వెనక్కు తగ్గాలని పాక్ కోరుతున్నట్టు పాకిస్థాన్ టుడే దినపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. 

  • Loading...

More Telugu News