: చైనా ప్రత్యర్థిపై సంచలన వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టిన బాక్సర్ విజేందర్ సింగ్!
భారత ప్రొఫెషనల్ బాక్సింగ్ వీరుడు విజేందర్ సింగ్ ఆగస్టు 5న ముంబైలో చైనాకు చెందిన జుల్పికర్ మైమైతియాలితో తలపడనున్నాడు. సాధారణంగా ప్రత్యర్థితో పోరాటం ముందు మౌనంగా ఉంటూ, ప్రత్యర్థులు ఎంత రెచ్చగొట్టినా పట్టించుకోకుండా బౌట్ లో తన పంచ్ లు రుచి చూపించే విజేందర్ తన శైలికి భిన్నంగా ఈసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముంబైలో విజేందర్ మాట్లాడుతూ, ‘ప్రత్యర్థిని 45 సెకన్లలో ఓడించేందుకు ప్రయత్నిస్తా. ఎందుకంటే చైనా ఉత్పత్తులు ఎక్కువ కాలం మన్నికగా ఉండవు మరి!’ అంటూ రెచ్చగొట్టాడు.
ఇప్పటి వరకు 8 ప్రొఫెషనల్ బాక్సింగ్ పోటీల్లో తలపడిన విజేందర్ సింగ్ ఓటమన్నది లేని వీరుడిగా నిలిచి, డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ మిడిల్ వెయిట్ ఛాంపియన్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. చైనాకు చెందిన జుల్ఫికర్ మైమైతియాలి కూడా విజేందర్ తరహాలో ఓటమెరుగని వీరుడే కావడం విశేషం. అలాగే అతని ఖాతాలో సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో వీరి పోరుపై ఆసక్తి రేగుతోంది.