: చైనా దుస్సాహసం.. ఉత్తరాఖండ్ లోకి చొచ్చుకొచ్చిన డ్రాగన్ సైన్యం
ఓవైపు సిక్కిం సరిహద్దుల్లోని డోక్లాం ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ... చైనా మరో దుస్సాహసానికి తెగించింది. ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లా బారాహోటీ ప్రాంతంలోకి చైనా బలగాలు మరోసారి చొచ్చుకు వచ్చాయి. ఈ ఘటన ఈ నెల 26వ తేదీన చోటు చేసుకుంది. ఈ నెల 19న కూడా చమోలీ జిల్లా సరిహద్దుల వద్ద చైనా సైన్యం ఉద్రిక్తతలు పెరిగేలా ప్రవర్తించింది. సరిహద్దుల వద్ద ఆయుధాలతో కూడిన సైన్యం క్యాంపు వేసింది. ఓ సర్వే నిమిత్తం అక్కడకు వెళ్లిన జిల్లా కలెక్టర్, అధికారులు, ఇండో టిబెటర్ బోర్డర్ పోలీస్ బలగాలు అప్పుడు వారిని వెనక్కి పంపించేశాయి. ఆ సందర్భంగా ఈ భూభాగం తమదే అని చైనా బలగాలు వాదించాయి. చైనాతో ఉత్తరాఖండ్ రాష్ట్రం 350 కిలో మీటర్ల సరిహద్దును పంచుకుంటోంది.