: ఇసుక మాఫియా కోసం తెలంగాణను ఇచ్చామా?: మీరాకుమర్


తన హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ అన్నారు. తెలంగాణ అనేది నిమ్న వర్గాల ఆకాంక్ష అని తెలిపారు. అలాంటి తెలంగాణలోనే దళితులపై దాడి జరగడం బాధాకరమని అన్నారు. దళితులను రక్షించాల్సిన వారే, వారిపై దాడి చేశారని మండిపడ్డారు. దళితులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, పోలీసులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నేరెళ్ల ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని అన్నారు. ఇసుక మాఫియా కోసం తాము తెలంగాణను ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News