: కేసీఆర్ అండ చూసుకునే పోలీసులు రెచ్చిపోతున్నారు: ఉత్తమ్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల చేతుల్లోనే ఇసుక మాఫియా ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జైల్లో ఉన్న నేరెళ్ల బాధితులకు తాము ధైర్యం చెప్పామని... కరెంట్ షాక్ లు ఇచ్చి ఎనిమిది మందిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని మండిపడ్డారు. కేసీఆర్ అండ చూసుకునే పోలీసులు రెచ్చిపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో దళితులు, రైతులతో పాటు అనేక వర్గాలు దగా పడుతున్నాయని... అలాంటివారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ కావడానికి ఆనాటి స్పీకర్ మీరాకుమార్ ఎంతో సహకరించారని తెలిపారు. 

  • Loading...

More Telugu News