: కాపు రిజర్వేషన్ డిమాండ్ దశాబ్దాలుగా ఉంది: పవన్ కల్యాణ్


కాపు రిజర్వేషన్ సమస్యపై తానెప్పుడూ మాట్లాడలేదని అన్నారు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత దానిపై ఒక అవగాహన ఉందని అన్నారు. కాపు రిజర్వేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకాలం ఎందుకు నాన్చిందో తనకు తెలియదని అన్నారు. అలాగే కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టినప్పుడు అభ్యంతరం చెప్పని వారు... దానిని అమలు చేస్తామంటే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారో తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు.

తాను బీసీ నేత ఆర్.కృష్ణయ్యకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని, అప్పట్లో ఆయన కూడా అభ్యంతరం చెప్పినట్టు తనకు గుర్తులేదని చెప్పారు. కాపు రిజర్వేషన్ సమస్యను వివాదరహితంగా పరిష్కరించాలని ఆయన చెప్పారు. ఎవరైనా నేతలు రెచ్చగొడితే దాని వల్ల రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయి కానీ... ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయా? అని అడిగారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావడం ముఖ్యమని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News