: అమెరికా ట్రయిల్: క్షిపణిని గాల్లోనే పేల్చేసి చూసిన అగ్రరాజ్యం!
వరుస అణ్వాయుధ పరీక్షలతో అమెరికాను ఉత్తరకొరియా బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియాను అడ్డుకోగలమా? లేదా? అన్న విషయాన్ని రూఢీ చేసుకునేందుకు అమెరికా క్షిపణిని ప్రయోగించింది. అనంతరం తమ వద్దనున్న అత్యాధునికి క్షిపణి ధ్వంసక వ్యవస్థ (థాడ్ ) సాయంతో దానిని గాల్లోనే పేల్చివేసింది. అనంతరం ఉత్తరకొరియా బెదిరిస్తున్నట్టు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అమెరికాను చేరడం అంతసులభం కాదని, ఒకవేళ ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగానికి పూనుకున్నా... దానిని గాల్లోనే పేల్చేయగలమని స్పష్టం చేసింది. అలాస్కా నుంచి టెర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్(తాడ్)ను పరీక్షను నిర్వహించినట్టు అమెరికా తెలిపింది.