: 44 మంది ఎమ్మెల్యేలను రిసార్ట్ లో ఎందుకు పెట్టారు?: కాంగ్రెస్ ను నిలదీసిన అమిత్ షా


కాంగ్రెస్ పార్టీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. గుజరాత్ లోని 44 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు బెంగళూరుకు తరలించిందని... రిసార్ట్ లో పెట్టి ఎందుకు తాళం వేసిందని ఆయన ప్రశ్నించారు. సొంత ఎమ్మల్యేలను కూడా ఆ పార్టీ ఎందుకు స్వేచ్ఛగా తిరగనివ్వడం లేదని అన్నారు.

గుజరాత్ లోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ అక్రమంగా కొనుగోలు చేస్తోందని, రాజ్యసభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తమను దెబ్బతీసేందుకు ఈ పని చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమిత్ షా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ఒక్కరు ఎవరికి వారే ప్రధానమంత్రిగా భావించుకుంటారని... కానీ, ఏ ఒక్కరినీ ప్రధానిని చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉండదని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News