: ఈ వీడియోను వైరల్ చేయండి: హైదరాబాద్ పోలీస్ విజ్ఞప్తి
నగరంలో ట్రాఫిక్ నిబంధనల పట్ల పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల నిబంధనలను ట్రాఫిక్ పోలీసులు తీసుకొచ్చారు. ఇదే సమయంలో, వాహనదారుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కూడా ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. ఈ క్రమంలో, వాహనదారులను మరింత చైతన్యవంతులను చేసేందుకు తమ ట్విట్టర్ అకౌంట్ లో ఓ వీడియోను పోలీసులు అప్ లోడ్ చేశారు. అంతేకాదు, "ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరేంతవరకు వైరల్ కానివ్వండి. ఈ వీడియో ద్వారా రోడ్లపై ఉన్న జీబ్రా లైన్స్ పాదచారుల కోసం ఏర్పాటు చేశారన్న విషయం అందరికీ అర్థమవ్వాలి" అని ట్వీట్ చేశారు. ఈ వీడియోకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.