: సిట్ విచారణలో తనీష్ ను అడుగుతున్న ప్రశ్నలివే!
డ్రగ్స్ దందాలో సిట్ నుంచి నోటీసులు అందుకున్న 11వ సినీ ప్రముఖుడిగా, నేడు యువ నటుడు తనీష్ విచారణకు హాజరుకాగా, అధికారులు అతనిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఉదయం తన ఇంటి నుంచి నేరుగా విచారణకు వచ్చిన తనీష్ ను నలుగురు అధికారులు విచారిస్తుండగా, కాల్విన్ మొబైల్ లో తనీష్ ఫోన్ నంబర్ ఎందుకు ఉందన్న విషయంపైనే ప్రధానంగా ఇంటరాగేషన్ సాగుతున్నట్టు సిట్ వర్గాలు తెలిపాయి.
వీరిద్దరూ పలుమార్లు కాల్ చేసుకోవడాన్ని చూపుతూ, అందుకు కారణాలను సిట్ విచారిస్తోంది. దీంతో పాటు నవదీప్, తరుణ్ లు ఎప్పటి నుంచి పరిచయం? వారితో కలసి పార్టీలకు వెళతారా? ఎలాంటి పార్టీలకు వెళ్లేవారు? అక్కడ డ్రగ్స్ సరఫరా చేస్తారా? విదేశాల్లో ఏ పబ్ లకు వెళ్లారు? జిషాన్ నుంచి డ్రగ్స్ తీసుకున్నారా? వాటిని ఎవరెవరికి అందించారు? డ్రగ్స్ వాడేవారికి, దందా నడిపే వారికి మధ్యవర్తి మీరేగా? కాల్విన్ తో పరిచయం ఉందా? తదితర ప్రశ్నలను అడిగినట్టు సమాచారం.