: వైకాపా నేతలకు ప్రశాంత్ కిశోర్ క్లాస్!


మరో రెండేళ్లలో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కృషి చేస్తున్న వైకాపా అధినేత వైఎస్ జగన్, ఈ ఉదయం అన్ని నియోజకవర్గాల ఇన్ చార్జ్ లతో సమావేశం నిర్వహించి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను పేరు పేరునా పరిచయం చేశారు. ఆపై ఏపీలోని 175 నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతినిధులతో ప్రశాంత్ కిశోర్ మాట్లాడారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పాటించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలు చేయాలని, ప్రతి పోలింగ్ బూత్ స్థాయి నుంచి బలోపేతం కావడంపై ఇప్పటి నుంచే దృష్టిని సారించాలని అన్నారు.

తన టీమ్ లోని ముఖ్యమైన సభ్యులను పరిచయం చేశారు. వారు అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తారని చెప్పారు. ప్రతి నేత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని సలహా ఇచ్చారు. కనీసం నెలకోసారి సమావేశమై పార్టీ బలోపేతం అవుతున్న తీరును సమీక్షించుకోవాలని, ఎన్నికలు దగ్గరపడే కొద్దీ మరింతగా కృషి చేయాలని ప్రశాంత్ కిశోర్ సూచించారు. వైకాపా నేతల సమావేశం కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News