: చంద్రబాబుతో భేటీ అయిన పవన్.. జనసేనాని కోసం తూర్పుగోదావరి జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్న సీఎం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు భేటీ అయ్యారు. అమరావతిలోని సచివాలయంలో వీరి సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో కిడ్నీ బాధితుల అంశంపై బాబుతో పవన్ చర్చించారు. కిడ్నీ సమస్యపై హార్వర్డ్ వైద్య బృందం చేసిన అధ్యయనం నివేదికను ఈ సందర్భంగా చంద్రబాబుకు పవన్ అందించారు.
అంతకు ముందు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో పవన్ కు ఏపీ మంత్రి కామినేని స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు భారీ ఎత్తున ఎయిర్ పోర్టుకు తరలివచ్చారు. మరోవైపు, పవన్ కల్యాణ్ తో భేటీ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు తన తూర్పుగోదావరి జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ సాయంత్రం నాలుగు గంటలకు ప్రెస్ మీట్ లో పవన్ మాట్లాడనున్నారు.