: వెంకయ్యనాయుడికి ఓట్లు వేయబోము... దోస్తీ కుదుర్చుకున్న మూడు రోజులకే బీజేపీకి షాకిచ్చిన నితీశ్ కుమార్!
మహా ఘటబంధన్ ను బద్దలు కొట్టి, ఆర్జేడీ, కాంగ్రెస్ లకు టాటా చెప్పి, బీజేపీతో జతకలసి తన పీఠాన్ని కాపాడుకున్న జేడీ(యూ) అధినేత ముచ్చటగా మూడు రోజుల తరువాత ఆ పార్టీకి షాకిచ్చారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే తరఫున నిలబడిన వెంకయ్యనాయుడికి తమ పార్టీ మద్దతివ్వబోదని, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ తరఫున నిలబడ్డ గోపాలకృష్ణ గాంధీకే తమ పార్టీ సభ్యులు ఓట్లు వేస్తారని జేడీ(యూ) తేల్చి చెప్పింది. కూటమి నుంచి విడిపోవడానికి ముందే తాము గాంధీకి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నామని, దానిలో మార్పు వద్దని నితీశ్ కుమార్ నిర్ణయించారని, పార్టీ అధికార ప్రతినిధి కేసీ త్యాగి నేడు మీడియాకు వెల్లడించారు. ఇదే విషయాన్ని బీజేపీకి కూడా స్పష్టం చేయనున్నామని వెల్లడించారు.