: బిగ్ బాస్ కు ఎక్స్ ట్రా గ్లామర్.. హౌస్ లో అడుగుపెట్టిన అందాల భామ!


బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షోకు భారీ ఎత్తున ప్రేక్షకాదరణ లభిస్తోంది. టీఆర్పీ రేటింగుల్లో ఈ షో దూసుకుపోతోంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో నుంచి ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. నిష్క్రమించిన వారిలో హీరో సంపూర్ణేష్ బాబు, నటి జ్యోతి, సింగర్ మధుప్రియలు ఉన్నారు.

ఈ నేపథ్యంలో షోకు మరింత ఊపు తెచ్చేందుకు ఓ అందాల భామను నిర్వాహకులు హౌస్ లోకి తీసుకొచ్చారు. సంపూ స్థానంలో హాట్ హీరోయిన్ దీక్షాపంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. స్విమ్మింగ్ పూల్ లో హాట్ హాట్ గా దీక్షాపంత్ ఎంట్రీని ఈ రోజు ఎపిసోడ్ లో ప్రసారం చేయనున్నారు. అయితే, దీక్షకు తెలుగు అస్సలు రాకపోవడంతో... ఆమె ఎంత వరకు ప్రేక్షకులను అలరిస్తుందనే డౌట్ నెలకొంది.

  • Loading...

More Telugu News