: నిజమైన భారతావని ఇదే... సోదరభావాన్ని, మతసామరస్యాన్ని చూపే ఈ ఫొటోకు లక్షలాది లైక్ లు!
ఇండియాలో సోదరభావం, మతసామరస్యం ఎలా ఉంటాయన్న విషయాన్ని చూపుతున్న ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతగా హల్ చల్ చేస్తోందంటే, దీనికి 7 లక్షలకు పైగా లైక్ లు, లక్షకు పైగా రీట్వీట్లు వచ్చాయి. ఈ ఫొటోను చూసి గర్వించని భారతీయుడే లేడని కామెంట్లు వస్తున్నాయి. ఆ ఫొటోను శ్రీనగర్ కు చెందిన సీఆర్పీఎఫ్ కార్యాలయం సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
విధి నిర్వహణలో భాగంగా ఇద్దరు జవాన్లు కాపలాగా ఉన్న ప్రాంతంలో నమాజుకు సమయమైన సమయంలో తీసిన ఫొటోలు ఇవి. ఓ జవాను నమాజు చేస్తుండగా, మరో జవాను కాపలాగా నిలబడ్డాడు. 'బ్రదర్స్ ఇన్ ఆర్మ్స్ ఫర్ పీస్' పేరిట క్యాప్షన్ పెట్టిన సీఆర్పీఎఫ్ దీన్ని విడుదల చేయగా, ఇదే నిజమైన భారతావని అని నెటిజన్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.