: మా నాన్న ఎంత చెత్త విమర్శకుడో..!: ఛటేశ్వర్ పుజారా


ఈ వారంలో 50వ టెస్టు ఆడనున్న ఛటేశ్వర్ పుజారా, తన తండ్రి అరవింద్ పుజారా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయనో చెత్త విమర్శకుడని అన్నాడు. తన జీవితంలో గొప్ప వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరని, అయితే, ఎప్పుడూ కఠినంగా ఉంటూ, తాను ఏం చేసినా బాగాలేదంటూ, విమర్శలు గుప్పించే వాడని చెప్పుకొచ్చాడు. ఇద్దరి మధ్యా వాదనలు పెరిగేవని, చర్చించుకుని ఓ నిర్ణయానికి వస్తుండేవాళ్లమని చెప్పాడు.

తాను ఇప్పుడింత ఫామ్ లోకి రావడానికి తండ్రి కఠినత్వం, విమర్శనాత్మక వైఖరి కూడా కారణమని అన్నారు. గాయాలు బాధించిన తరువాత కోలుకోవడానికి చాలా కాలం పట్టిందని చెప్పుకొచ్చాడు. తన కెరీర్ లో ఎత్తు పల్లాలు ఎన్నో ఉన్నాయని, ప్రస్తుతం బాగా ఆడుతున్నందున తదుపరి మ్యాచ్ లలో సైతం అధిక పరుగులు సాధించగలనన్న నమ్మకం ఉందని అన్నాడు. కాగా, ఇప్పటివరకూ పుజారా 49 టెస్టుల్లో 3,966 పరుగులు సాధించాడు. 50వ టెస్టును కొలంబోలో శ్రీలంకతో ఆడనున్నాడు.

  • Loading...

More Telugu News