: డాక్టర్ చంద్రశేఖర్ కృషిని చూసి పాదాభివందనం చేసిన పవన్ కల్యాణ్!
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల సమస్యలను పరిష్కరించే దిశగా సీనియర్ వైద్యుడు చంద్రశేఖర్ చేస్తున్న కృషిని తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయనకు పాదాభివందనం చేసి, ఆయనపట్ల తనకున్న గౌరవాన్ని తెలియజేశారు. హార్వర్డ్ నుంచి వచ్చిన వైద్య బృందంతో సమావేశమై, వారు శోధించిన విషయాలను గురించి అడిగి తెలుసుకున్న పవన్, ఈ ప్రాంతంలో వాతావరణ కాలుష్యం, నీటిలో లోహాలు అధికంగా ఉండటం వంటి కారణాలతో కిడ్నీ సమస్యలు వస్తున్నాయని అన్నారు. హార్వర్డ్ నుంచి వచ్చిన డాక్టర్ సుబ్బిశెట్టి వెంకట్, ఈ ప్రాంతంలో పరిశోధనలకు అండగా నిలిచారని పవన్ ప్రశంసించారు. ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ అండ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని, బయో బ్యాకింగ్ తో పాటు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని పవన్ కోరారు.