: ఉగ్రవాదుల కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం.. చుండూరులో విషాదం!


ఉగ్రవాదుల కాల్పుల్లో తెలుగు జవాను వీరమరణం పొందాడు. శనివారం రాజస్థాన్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుంటూరు జిల్లా చుండూరుకు చెందిన మోదుకూరి నాగరాజు (28) అమరుడయ్యాడు. ఈ మేరకు ఆదివారం జవాను తండ్రి సోమయ్యకు ఆర్మీ అధికారులు సమాచారం అందించారు. సోమయ్యకు ముగ్గురు సంతానం కాగా ఇద్దరు దేశ సేవలోనే ఉన్నారు. నాగరాజు పదేళ్ల క్రితం సైన్యంలో చేరాడు. నాగరాజుకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం రెండో కాన్పు కోసం నాగరాజు భార్య ఆసుపత్రిలో చేరారు. నాగరాజు మృతి వార్త తెలిసి చుండూరులో విషాద ఛాయలు అలముకున్నాయి. నాగరాజు మృతదేహం నేడు చుండూరుకు చేరుకోనుంది. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News