: కేంద్ర కేబినెట్‌లోకి అమిత్ షా.. రక్షణ మంత్రిగా బీజేపీ అధ్యక్షుడు?
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా త్వరలో కేంద్ర కేబినెట్‌లో చేరబోతున్నారా? రక్షణ మంత్రి పదవి కూడా ఆయనకు సిద్ధంగా ఉందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. గుజరాత్ నుంచి ఐదుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన అదే గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. అనంతరం అక్కడి నుంచి కేంద్ర మంత్రి పదివిని అధిష్ఠించనున్నట్టు తెలుస్తోంది. షాకు హోం, లేదంటే రక్షణ మంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ఆయనకు పదవి కట్టబెట్టేందుకే రాజ్యసభకు తీసుకొస్తున్నట్టు ఢిల్లీ నేతల భోగట్టా. మరోవైపు గుజరాత్ నుంచే రాజ్యసభకు ఎన్నిక కానున్న స్మృతి ఇరానీకి సమాచార, ప్రసారశాఖల మంత్రిగా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది.