: పవన్ కల్యాణ్ తొలిసారి ఉద్ధానం వెళ్లి వచ్చాక, మూడు రోజులు తన గదిలోంచి బయటకు రాలేదట!
ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం వెళ్లి, వారి బాధలన్నీ విన్న తరువాత తిరిగి హైదరాబాదులోని తన నివాసానికి చేరుకున్నాక గదిలోకి వెళ్లి మూడు రోజుల పాటు బయటకు రాలేదని ఆయన స్నేహితులు తెలిపారు. ఆ రోజు ఆయన నిర్ణయించుకున్న ఆలోచనతోనే ఇప్పుడు హార్వార్డ్ ప్రొఫెసర్ల టీమ్ తో పరిశోధనలు చేయించడం జరిగిందని వారు చెబుతున్నారు. ప్రజలకోసం పని చేయాలన్న ఆలోచనతోనే సమస్యను పవన్ కల్యాణ్ భుజాన వేసుకున్నారని చెప్పారు. ఈ సమస్యకు పవన్ కల్యాణ్ పరిష్కారం చూపించే ప్రయత్నంలో ఉన్నారని వారు చెబుతున్నారు.