: 50 ఏళ్లుగా సిగిరెట్ తాగొద్దని చెబుతున్నారు.. ఎవరైనా మానారా?: రాంగోపాల్ వర్మ


గత 50 ఏళ్లుగా 'పొగతాగడం హానికరం... సిగిరెట్లు తాగకండి' అంటూ ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. మరి ఎంతమంది మారారు? అని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు. డ్రగ్స్ దందాపై సిట్ అధికారులపై తాను విమర్శలు చేయలేదని అన్నారు. మద్యం మానేయమని చెబుతూ వచ్చిన ఎన్నో వందల, వేల యాడ్లు చూశానని, ఆయితే వాటి వల్ల ఒక్కరు కూడా మారినట్టు తనకు తెలియదని అన్నారు. అలాంటప్పుడు డ్రగ్స్ మానేయండి అని చెబితే ఎవడు మానేస్తాడని వర్మ అడిగారు. చెడును మానేయమంటే ఎవడూ మానెయ్యడని, డ్రగ్స్ మీద తాను ఎవరికీ మెసేజ్ ఇవ్వనని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News