: సినిమాలోని సన్నివేశాన్ని నిజం చేసిన అభిమాని... ఆశ్చర్యానందాల్లో పూజా హెగ్డే!


సాధారణంగా సినిమాల్లో ప్రేమను చూపించేందుకు అతిశయోక్తిలా అనిపించే సంఘటనలను సన్నివేశాలుగా దర్శకులు చూపిస్తుంటారు. అలాంటి సన్నివేశాలను స్పూర్తిగా తీసుకుని అభిమానులు అలాంటి పనులే చేస్తుంటారు. అలాంటి పనినే ఒక అభిమాని చేసి హీరోయిన్ ను ఆశ్చర్యానందంలో ముంచెత్తాడు. ఘటన వివరాల్లోకి వెళ్తే... నాగచైతన్య, పూజ హెగ్డే జంటగా నటించిన 'ఒక లైలా కోసం' సినిమాలో... హీరో తన ప్రేమను వ్యక్తం చేస్తూ... ఒక నక్షత్రానికి హీరోయిన్ పేరు పెడతాడు. ఆ సన్నివేశాన్ని ఒక అభిమాని కాపీ కొట్టాడు. లండన్ కు చెందిన ఒక అభిమాని, నక్షత్రాలకు నచ్చిన వారి పేర్లు పెట్టే ఆన్ లైన్ సంస్థ సహకారంతో సినీ నటి పూజా హెగ్డే పేరు ఒక నక్షత్రానికి పెట్టాడు. తన అభిమాన నటిపై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా ఆయన వ్యక్తం చేశాడు. 

  • Loading...

More Telugu News