: యాక్సిడెంట్ సమయంలో మంచు విష్ణుతో పాటు బైక్ పై హీరోయిన్ కూడా ఉందట!


'ఆచారి ఆమెరికా యాత్ర' సినిమా షూటింగ్ మలేసియాలో జరుగుతుండగా, ఈ రోజు షూటింగ్ లో ఛేజింగ్ సీన్ చేస్తున్న సమయంలో యాక్సిడెంట్ అయి మంచు విష్ణు గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. దీనిపై విష్ణు తండ్రి మోహన్ బాబు, సోదరి మంచు లక్ష్మీ ప్రసన్న, సోదరుడు మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దేవుడి దయవల్ల పెను ప్రమాదం నుంచి తన కుమారుడు బయటపడ్డాడని మోహన్ బాబు తెలిపారు. తమ సోదరుడు కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని లక్ష్మి, మనోజ్ తెలిపారు. గాయపడినా సురక్షితంగా ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు విష్ణు బైక్ వెనుక హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కూర్చుని ఉందని దర్శకుడు బీవీఎస్ రవి తెలిపారు. ఆమెకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News