: అలాంటి అబ్బాయి దొరికితే ఎవరైనా చెప్పు పంపిస్తారా?: సాయిపల్లవి


'ఫిదాలోని వరుణ్ లాంటి అబ్బాయిలు ఈ రోజుల్లో ఉంటారా?' అంటూ భానుమతి ఉరఫ్ సాయిపల్లవి అడుగుతోంది. ఈ సినిమా చూసిన తరువాత అలాంటి అబ్బాయి ఉంటాడా? అని ఆలోచించానని చెప్పింది. ఫిదా ప్రమోషన్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అలాంటి అబ్బాయి ఉంటే మాత్రం ఏ అమ్మాయి కూడా రిజెక్ట్ చేయదని చెప్పింది. ఒక వేళ రిజెక్ట్ చేసినా చెప్పుమాత్రం చూపించదని చెప్పింది. తనకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే తాను చెప్పు చూపించనని చెప్పింది.

ఆ సినిమాలో ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేస్తే, భానుమతి చెప్పు చూపించిందని, దానికి తాను చాలా హర్టయ్యానని వరుణ్ తేజ్ అన్నాడు. దీంతో సాయి పల్లవి 'అయ్యో, అప్పుడలా అనలేదు...' అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. దీంతో వరుణ్ తేజ్ కాసేపు సాయి పల్లవిని ఆటపట్టించాడు. దీంతో దిల్ రాజు కల్పించుకుని... 'అయినా సాయిపల్లవి అలా ఎవరైనా అబ్బాయికి చెప్పు చూపించడం తప్పు' అనడంతో... 'అయ్యో.. నేను చూపించలేదు సర్... భానుమతి కేరక్టర్ చూపించింది. అయినా ట్రైన్ లో అవన్నీ విన్న తరువాత ఏ అమ్మాయి అయినా అలాగే చెబుతుంది' అని చెప్పింది. ఈ సమయంలో కాసేపు వరుణ్, దిల్ రాజు సాయి పల్లవిని ఆటపట్టించగా, శేఖర్ కమ్ముల ఆమెకు మద్దతుగా నిలిచాడు. టీవీలో ప్రసారమైన వీరి సంభాషణ అకట్టుకుంటోంది. 

  • Loading...

More Telugu News