: ఫిదా సినిమాలోని ఆ డైలాగుకి అర్థం ఇంకా తెలియదు!: సాయిపల్లవి
'ఫిదా' సినిమాలో భానుమతి పాత్రతో ప్రేక్షకులను ఫిదా చేసేసి బుట్టలో వేసుకున్న సాయిపల్లవి (సినిమాలో పాత్ర పేరు భానుమతి)కి ఆ సినిమాలో బాగా పాప్యులర్ అయిన డైలాగుకి ఇప్పటికీ అర్థం తెలియదట. ఇందులో 'భాడ్కోవ్! బలిసిందారా?.. బొక్కలిరగ్గొడతా..నకరాలా?' అంటూ చెప్పే డైలాగ్ బాగా పాప్యులర్ అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ పదం అర్థం తెలుసుకోలేదని, డైరెక్టర్ ఎలా చెబితే అలా నటించడం మీదే తన దృష్టి ఉందని చెప్పింది. ఆ తరువాత దాని అర్థం తెలుసుకోవాల్సిన అవసరం రాలేదని చెప్పింది. అయితే ఆ డైలాగ్ చూసిన తన తల్లి తెలుగులో మొదటి సినిమా, మొదటి డైలాగే బూతా? అని అడిగిందని చెప్పింది. అయితే ఆ డైలాగ్ ప్రేక్షకులకు బాగా నచ్చిందని, అది చాలని, ఇప్పుడు ఆ పదం అర్థం తెలుసుకోవాలన్న కుతూహలం తనకు లేదని తెలిపింది.