: స్పెయిన్ లోని బార్సిలోనాలో భారీ అగ్నిప్రమాదం
స్పెయిన్ లోని బార్సిలోనాలో జరిగిన భారీ అగ్నిప్రమాదం ఆందోళనకు గురి చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే... బార్సిలోనాలో ఒక సంగీత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం చివర్లో బాణాసంచా కాల్చారు. ఈ సమయంలో ఎగసిపడిన నిప్పురవ్వలు పరిసరాల్లో పడి మంటలంటుకున్నాయి. క్షణాల్లో మంటలు చుట్టుముట్టాయి. దీంతో నిర్వాహకులు ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారితోపాటు, హాజరైన 22,000 మందిని ఖాళీ చేయించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.