: జర్మనీలోని నైట్ క్లబ్ లో కాల్పుల కలకలం!


జర్మనీలోని కాన్‌ స్టాంజ్‌ నగరంలోని నైట్ క్లబ్ లో కాల్పుల కలకలం రేగింది. కాన్ స్టాంజ్ నగరంలోని గ్రే నైట్‌ క్లబ్‌ లో ప్రవేశించిన దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో క్లబ్ లో ఉత్సాహంగా గడుపుతున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల సమాచారం అందండంతో వేగంగా స్పందించిన పోలీసులు హుటాహుటీన క్లబ్ ను చుట్టుముట్టారు.

క్షణాల్లో పోలీసులు చుట్టుముట్టడంతో వారికి చిక్కకుండా పారిపోయేందుకు దుండగుడు ప్రయత్నించగా, అతనిపై కాల్పులు జరిపారు. దీంతో తీవ్రగాయాలపాలైన దుండగుడి సహా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అయితే అతను ఎందుకు కాల్పులకు తెగబడాల్సి వచ్చింది? అతను ఉగ్రవాదా? సాధారణ పౌరుడా? వంటి వివరాలు వెల్లడించాల్సి ఉంది. అయితే కాల్పుల నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతమంతా గాలింపు చేపట్టారు. కాగా, గత కొంత కాలంగా జర్మనీని లక్ష్యం చేసుకున్న ఉగ్రవాదులు వివిధ రూపాల్లో దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News