: ఇక మా నేత శరద్ యాదవ్: లాలూ


బీహార్ లో బీజేపీ - జేడీ(యూ) కూటమిని అడ్డుకునేందుకు నిన్నటివరకూ నితీశ్ కుమార్ తరువాత ఆ పార్టీకి ప్రధాన నేతగా ఉన్న శరద్ యాదవ్ కు వలేస్తున్నారు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. సీఎం నితీశ్ కుమార్, ఇంతవరకూ విభేదిస్తూ వచ్చిన బీజేపీతో జట్టు కట్టడాన్ని బహిరంగంగానే విమర్శించిన శరద్ యాదవ్ ను అక్కున చేర్చుకుంటే, లబ్ధి పొందవచ్చని భావిస్తున్న ఆయన, ఇక తమ నేత శరద్ యాదవేనని ప్రకటించారు.

"మా నేతగా నిలిచి, బీజేపీపై జరిపే పోరాటాన్ని ముందుండి నడిపించాలని శరద్ యాదవ్ ను నేను కోరుతున్నా" అని అన్నారు. శరద్ యాదవ్ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించి వచ్చిన తరువాత లాలూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ పదవిని వీడేందుకు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అంగీకరించక పోవడంతో, గత బుధవారం నాడు నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆపై 14 గంటల వ్యవధిలోనే బీజేపీ మద్దతుతో మరోసారి అవే బాధ్యతలను ఆయన స్వీకరించారు. ఇక బీజేపీ - జేడీ (యూ) బంధం అనైతికమని, నితీశ్ స్వీయ ప్రయోజనాల కోసమే రాజకీయాలు చేస్తున్నారని లాలూ ప్రసాద్ యాదవ్ నిప్పులు చెరిగారు కూడా.

  • Loading...

More Telugu News