: వైకాపాలో చేరిన నంద్యాల టీడీపీ నేత
నంద్యాల టీడీపీకి చెందిన మైనారిటీ వర్గం ముఖ్య నేత రసూల్ ఆజాద్, వైకాపా కండువా కప్పుకున్నారు. వైకాపా తరఫున నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నిలబడ్డ శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన, తన అనుచరులతో సహా వచ్చి వైకాపాలో చేరారు. వారిని సాదరంగా ఆహ్వానించిన శిల్పా, ఉప ఎన్నిక కారణంగానే నంద్యాలపై చంద్రబాబు ప్రేమను చూపుతున్నారని ఆరోపించారు. అభివృద్ధి పేరిట కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని అంకెల గారడీని చూపిస్తున్నారని నిప్పులు చెరిగారు. రానున్న ఎన్నికల్లో గెలిచేది వైకాపాయేనని నొక్కి చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించిందని విమర్శించారు.