: 'నన్ను క్షమించండి'... రాజీనామాకు నిమిషాల ముందు లాలూకు ఫోన్ చేసిన నితీష్


ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్... పాట్నాలో సీఎం నితీశ్ కుమార్ పక్కింట్లోనే ఉంటారు. మహా ఘటబంధన్ ను తెంచుకోవాలని నిర్ణయించుకున్న వేళ, నితీశ్ ఈ విషయాన్ని లాలూకు ఫోన్ చేసి చెప్పారట. రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడానికి సరిగ్గా పది నిమిషాల ముందు లాలూకు ఫోన్ చేసిన నితీశ్, "లాలూజీ... దయచేసి నన్ను క్షమించండి. 20 నెలల పాటు ప్రభుత్వాన్ని నడిపిన తరువాత, ఇంక నడిపించలేనని భావిస్తున్నా. నేను రాజీనామా చేస్తున్నా" అని ఆయన చెప్పారు.

తన కొత్త మంత్రులకు స్వయంగా నితీశ్ ఈ విషయాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. ఆపై కాంగ్రెస్, ఆర్జేడీలతో తెగదెంపులు చేసుకుంటూ, ఆయన రాజీనామా చేయడం, మరుసటి రోజు బీజేపీ మద్దతుతో తిరిగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం, ఆ వెంటనే బల నిరూపణ, నిన్న మంత్రి వర్గ విస్తరణ... అన్నీ వరుసగా జరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం ఉండటంతో నితీశ్ ఎలా నెగ్గుకు వస్తారన్న విషయం ఆసక్తికరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News