: నితీశ్ కేబినెట్‌లో 12 మంది బీజేపీ నేతలకు చోటు.. పాశ్వాన్ సోదరుడికి కూడా మంత్రి పదవి!


రాజీనామా అనంతరం తిరిగి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్  27 మందిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. వీరిలో 14 మంది జేడీయూ శాసన సభ్యులు కాగా, 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు. ఎల్‌జేపీ చీఫ్ రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడు పశుపతి నాథ్ పరాస్‌ను మంత్రిని చేశారు. నిజానికి ఆయన శాసనసభ్యుడు కాదు. కాగా, ఎన్డీఏలోని భాగస్వామ పక్షాలైన ఆర్ఎల్ఎస్‌పీ, హెచ్ఏఎం(ఎస్) తదితర వాటికి కేబినెట్‌లో చోటు దక్కలేదు. ముఖ్యమంత్రి నితీశ్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీతో కలుపుకుని కేబినెట్ బలం 29కి చేరుకుంది.

నితీశ్ కుమార్ హోం, సాధారణ పరిపాలన, విజిలెన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖలను తన వద్దే పెట్టుకోగా, మోదీ వద్ద ఆర్థిక, వాణిజ్య పన్నులు, పర్యావరణం, అడవులు, సమాచార సాంకేతిక శాఖలు ఉన్నాయి. మరో ఆరుగురు మంత్రులు త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు బీజేపీ నేత, కొత్త మంత్రి నంద్ కిశోర్ యాదవ్ తెలిపారు. మంత్రుల్లో 19 జేడీయూ నుంచి బీజేపీ, ఎల్‌జేపీ, ఆర్ఎల్ఎస్‌పీ, హెచ్ఏఎంఎస్ నుంచి 16 మందిని తీసుకోవాలని ముందే నిర్ణయించినట్టు ఆయన వివరించారు. కాగా, పరాస్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడంపై హెచ్ఏఎంఎస్ అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News