: క్యాబేజీ విత్ స్నేక్ కర్రీ తిని ఆసుపత్రిపాలైన తల్లీకూతుళ్లు


క్యాబేజీ విత్ స్నేక్ కర్రీని తిన్నతల్లీకూతుళ్లు ఆసుపత్రిలో చేరిన ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... ఇండోర్ లో నివాసం ఉండే అఫ్‌ జాన్ ఇమామ్ (36) అనే మహిళ క్యాబేజీ కూరను చేశారు, దానిని ఆమె తన కుమార్తె ఆమ్నా (15)  తో కలిసి తిన్నారు. కూర అకస్మాత్తుగా చేదు అనిపించడానికి తోడు వెంటనే వాంతులయ్యాయి. దీంతో ఆమె కూరను పరిశీలించగా కూరలో పాము ముక్కలు కనిపించాయి. దీంతో ఇద్దరూ బెంబేలెత్తిపోయారు. వెంటనే వారిని బంధువులు ఆసుపత్రిలో చేర్చారు. వారికి వైద్యులు చికిత్స ప్రారంభించారు.

ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, అయితే పాము విషం మనిషి రక్తంలో సమ్మిళితమై, శరీరమంతా పాకినప్పుడే ప్రమాదకరంగా మారుతుందని, వారు ఆహారంగా నోటి ద్వారా తీసుకోవడంతో వారిని మరింత జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని, రెండు రోజుల అబ్జర్వేషన్ అనంతరం మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. వారి శరీర కణజాలానికి ఎలాంటి హాని జరిగిందో గుర్తించాలని వారు తెలిపారు. క్యాబేజీ కూరలో పాము పొరబాటున పడి ఉడికిపోయి ఉంటుందని భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News