: సుకుమార్ తో మళ్లీ 'ఆర్య' సీక్వెల్ అంటే... చాలా కష్టం..!: అల్లు అర్జున్
సుకుమార్ తో మళ్లీ 'ఆర్య 3' సినిమాలో నటించాలంటే కష్టమని చెప్పాడు అల్లు అర్జున్. 'దర్శకుడు' సినిమా ఆడియో లాంఛ్ లో పాల్గొన్న సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, మంచి కథ దొరికితే సుకుమార్ తో కలిసి చేస్తానని చెప్పాడు. 'ఆర్య' సినిమాలో కేరెక్టర్ కు కొంచెం తిక్క ఉంటుందని చెప్పాడు. ఇక 'ఆర్య 2'లోని కేరక్టర్ కి ఇంకాస్త క్రాక్ ఉంటుందని అన్నాడు. ఇక 'అర్య 3'లో కేరక్టర్ ఎలా వుంటుందో ఆలోచించండని అన్నాడు. ఇంచుమించు అది పిచ్చి కేరెక్టర్ అవుతుందని చెప్పాడు. అలాంటి సినిమాను అభిమానులు ఆదరిస్తారని తాను భావించడం లేదని చెప్పాడు. అందుకే మంచి కథ కుదిరినప్పుడు చేస్తామని చెప్పాడు.
'దర్శకుడు' సినిమాను అభిమానులు ఆదిస్తారని ఆశిస్తున్నానని చెప్పాడు. సుకుమార్ దర్శకుడిగా ఉన్న సమయంలో నిర్మాతగా మారి రిస్క్ చేశాడని, అతనికి దిల్ రాజు కూడా కలవడంతో ఈ సినిమాపై మంచి నమ్మకం కుదురుతుందని అన్నాడు. ఒకే ఏడాది నాలుగు విజయవంతమైన సినిమాలను నిర్మించిన దిల్ రాజు సినిమా అంటే ప్రేక్షకుల్లో నమ్మకం పెరుగుతుందని అల్లు అర్జున్ తెలిపాడు.